RGV Comments On His Mother మా అమ్మ మీద పగ తీర్చుకుంటా

  • 7 years ago
"My mother thought I'll be a good for nothing bum...So I'm making her give clap for my new film with Nag...My revenge completes" says ram gopal varma on his facebook wall
ప్రతి రోజు ఏదో ఒక వివాదంతో, వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ క్రియేటివ్ డైరెక్టర్ మాత్రమే కాదు. న్యూస్ క్రియేటర్ కూడా. ఆ మధ్య వర్మ నిత్యం ఎవరోకరి గురించో, ఏదోక మేటర్ మీదో కామెంట్ చేసి అందరినీ తనవైపు తిప్పుకునే టెక్నిక్ వర్మకి బాగా తెలుసు.
ఒకనాటి సంగతులు గుర్తు తెచ్చుకుంటూనే తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. ప్రతీసారీ పవన్ కళ్యాణ్ నీ బయటి జనాన్నీ అనీ అనీ బోరొచ్చిందేమో అందుకే ఈసారి తన తండ్రి గురించి, అమ్మ గురించీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నిజానికి అసలు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నాగార్జునతో తాను తీయబోతున్న సినిమాకి పబ్లిసిటీలో భాగంగా అనుకోవాలి. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరక్షన్‌‍లో నాగార్జున హీరోగా కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. శివ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ .

Recommended