• 7 years ago
Janhvi Kapoor's Bollywood debut was officially launched by producer Karan Johar. Dhadak, which is said to the remake of hit Marathi film Sairat. But before she begins shooting for debut project, Janhvi is also in news for another film.

అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాహ్నవి కపూర్ బాలీవుడ్ ఎంట్రీ అధికారికంగా ఖారారైంది. దడక్ ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకుల హృదయాల్లో దడ పుట్టిస్తున్నది. బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ నేతృత్వంలో జాహ్నవి కపూర్ హిందీ చిత్ర సీమకు పరిచమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కరణ్ బుధవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాడు. జాహ్నవి, ఇషాన్ కట్టర్‌తో కూడిన ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే సినిమా ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నట్టు సమాచారం..
మరాఠీ చిత్రం సైరత్ దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకొన్న ఓ యువతి, యువకుడి ప్రేమ కథ ప్రేక్షకలను విశేషంగా ఆకట్టుకొన్నది. దాంతో ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఈ చిత్ర సగభాగం మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకొన్నది. నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రింకూ రాజ్‌గురు, ఆకాశ్ థోసర్ నటించారు.
వీరు పోషించిన పాత్రలను ప్రస్తుతం హిందీలో శ్రీదేవి కూతురు జాహ్నవి, షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్ పోషిస్తున్నారు.

Recommended