బిచ్చగాడిని మించే పాత్రలో.. విజయ్ ఆంటోని

  • 7 years ago
Actor-producer-composer Vijay Antony has been signed to play a pivotal role in the biopic of social activist Traffic Ramasamy, known for his intense and vigorous involvement towards social affairs.

నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని సంచలనాత్మక బయోపిక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి జీవిత కథ ఆధారంగా రూపొందే చిత్రంలో నటించడానికి విజయ్ ఆంటోని సిద్ధమవుతున్నాడు. బిచ్చగాడు లాంటి విభిన్న చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చే విజయ్ తాజాగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారనే వార్త కోలివుడ్‌లో చర్చనీయాంశమైంది.
సామాజిక కథాంశంతో రూపొందే ఈ చిత్రంలో విజయ్ ఆంటోని ఓ కీలక పాత్రను పోషిస్తున్నారనేది కోలీవుడ్ సమాచారం. యువకుడిగా ఉండే ట్రాఫిక్ రామస్వామి పాత్రను విజయ్ ఆంటోని పోషించనున్నారని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. సమాజంలో ఎదురైన సమస్యలను ట్రాఫిక్ రామస్వామి ఎలా ఎదిరించాడనేది సినిమా కథాంశం.
ట్రాఫిక్ రామస్వామి క్రేజీ ప్రాజెక్ట్‌లో సీనియర్ దర్శకుడు, నటుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ వృద్ధ ట్రాఫిక్ రామస్వామి పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు భార్యగా రోహిణి నటించనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఇంకా ఈ చిత్రంలో ఆర్కే సురేశ్, ఉపాసన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సీనియర్ నటి అంబిక చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ తెర మీద కనిపించనుండటం ఈ సినిమాకు మరో ప్రత్యేకత.
ప్రస్తుతం కొత్త దర్శకుడు శ్రీనివాసన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న అన్నాదురై (ఇంద్రసేన) చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో విజయ్ ఆంటోని బిజీగా ఉన్నారు. ఇంద్రసేన ఆడియో రిలీజ్ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 30న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని కవల సోదరుల పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నటి రాధిక, విజయ్ ఆంటోని భార్య ఫాతిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Recommended