• 8 years ago
MS Reddy, popularly called Mallemala who gave life to Gunasekhar’s career. He wrote, how Gunasekhar begged him for various favours and opportunities and finally, when he had to return a favour, Gunasekhar turned his back to the ace filmmaker cum writer.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డ్స్‌పై నిరసన జ్వాలలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. నంది అవార్డులపై రగడ నడుస్తూనే ఉంది. తమ చిత్రానికి నంది పురస్కారం దక్కకపోవడంతో దర్శకుడు గుణశేఖర్‌ జ్యూరీపై బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోపక్క జ్యూరీ సభ్యులు కూడా సోషల్‌ మీడియాలో తమను విమర్శించే వారిపై ఎదురుదాడికి దిగారు. దీంతో నందుల వివాదం మరింతగా ముదురుతోంది. ఆ వివాదం ఇప్పుడు ఇంకో కొత్త రూట్లోకి మారింది. గుణశేఖర్ సోషల్ మీడియాలో సడెన్ గా తెలుగువారి ఆరాధ్య నటుడు ఎన్.టి.రామారావు ప్రస్తావన తీసుకొచ్చాడు.
ఆ మధ్య సీనియర్ డైరెక్టర్ మల్లెమాల ఎం.ఎస్.రెడ్డి ఇది నా కథ పేరుతో తన జీవిత చరిత్ర రాశారు. ఇందులో గుణశేఖర్ తనకు ఎలా పరిచయమైంది.. ఆ పరిచయం ఎలా పెరిగింది రాసుకొచ్చారు. కెరీర్ లో పైకెదిగాక గుణశేఖర్ తన పట్ల చాలా అవమానకరంగా వ్యవహరించాడని డైరెక్ట్ గానే రాశారు.
ఇదే పుస్తకంలో తెలుగువారి ఆరాధ్య నటుడు ఎన్.టి.రామారావు తన ఖర్చులన్నీ ఎదుటివారి నెత్తిన వేసేవారంటూ ఓ ఆర్టికల్ కూడా రాశారు. అయితే ఈ ఆర్టికల్ చదివిన గునశేఖత్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా స్పందించాడు అయితే ఘాటుగా కాదు గానీ కాస్త వెటకారంగానే తన రియాక్షనేంటో చెప్పాడు.
తనగురించి మల్లెమాల రాసిన పేజీలను.. అండర్ లైన్ చేసి మరీ షేర్ చేసిన గుణశేఖర్ "ఈ నిందల్ని నిజం అని కొందరు ‘తమ్ముళ్ళు' సమర్ధించవచ్చేమో గానీ ఇదే పుస్తకంలో ‘అన్నగారి'పై వచ్చిన నిందల్ని నేను ఏమాత్రం నిజమని సమర్ధించను" అంటూ చిన్నపాటి చురక వేశాడు.

Recommended