• 7 years ago
A woman doing dharna in her aunt's village due to dowry in West Godavari district.

అత్తింటివారు పెట్టే అదనపు కట్నం వేధింపులు భరిస్తున్నప్పటికీ.. ఇంట్లో నుంచి బయటికి గెంటేయడంతో ఓ వివాహిత పోలీసులను, మహిళా సంఘాలను ఆశ్రయించింది. ఈ ఘటన జిల్లాలోని గోపాలపురం మండలం వెదుళ్లకుంటలో చోటు చేసుకుంది. కాగా, బాధితురాలికి మద్దతుగా గురువారం వెదుళ్లకుంటలో మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. వారి మద్దతు ఆమె అత్తింటి వేధింపులకు వ్యతిరేకంగా తన కూతురుతోపాటు నిరసన కొనసాగిస్తోంది.
2015 మేలో పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన యాగంటి శివరామకృష్ణ, కనకదుర్గల కుమార్తె శ్రీదేవిని గోపాలపురం మండలం వెదుళ్లకుంట గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు మోహనకృష్ణకు ఇచ్చి వివాహం చేశారు. అప్పట్లో కట్నం కింద రూ 15 లక్షలు, 70 కాసులు బంగారం ఇచ్చారు. శ్రీదేవి తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించడంతో తల్లి కనకదుర్గే అన్నీ చూసుకుంది. కాగా, పెళ్లి అయిన తర్వాత కొంతకాలం బెంగళూరులో కాపురం పెట్టారు శ్రీదేవి దంపతులు. ఈ క్రమంలో వారికి ఓ పాప పుట్టింది. కాగా, కట్నంగా ఇచ్చిన 70 కాసుల బంగారం, నగదును మోహనకృష్ణ దుబారాగా ఖర్చు చేశాడు. అంతేగాక, ఆమెను శారీకంగా హింసించేవాడు.

Category

🗞
News

Recommended