జవాన్ పైరసీ పై దర్శకుడు ఫైర్ !

  • 7 years ago
Director BVS Ravi gets emotional over piracy mafia attacked Jawaan movie. He said that on Release day, by afternoon movie comes and exhibited on Internet mediums.

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, టాలీవుడ్ గోల్డెన్ లెగ్ మెహ్రీన్ ఫిర్జాదా నటించిన జవాన్ చిత్రం రిలీజై ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటున్నది. రిలీజ్ రోజే ఈ చిత్రం పైరసీ కోరల్లో చిక్కుకొని ఇంటర్నెట్ మాధ్యమాల్లో ప్రసారం కావడంపై దర్శకుడు బీవీఎస్ రవి ఆవేదన వ్యక్తం చేశాడు. పైరసీ పాల్పడుతున్న వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో మనస్తాపానికి గురయ్యాడు. పైరసీ వల్ల నిర్మాతలు, పంపిణీదారులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జవాన్ చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షకులు సినీ విమర్శకులు నుంచి మంచి స్పందన వచ్చింది. విడుదలైన వెంటనే జవాన్ పైరసీ కాటుకు గురైంది. దాంతో తమ సంతోషం ఆవిరైపోయింది. అప్పుడే బస్సులో కూడా సినిమాను ప్రదర్శిస్తున్నారు అని బీవీఎస్ రవి వెల్లడించారు.

Recommended