• 7 years ago
Air India is in the news once again. An Air India flight to Delhi from Vijaywada was delayed by around 1.30 hours. AI 459 was carrying over 100 passengers including minister of civil aviation Ashok Gajapati Raju onboard

ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ మరోసారి వివాదాల్లోకి ఎక్కింది. సిబ్బంది రాకపోవడంతో బుధవారం విమానం గంటన్నర ఆలస్యంగా బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు కూడా ఉన్నారు. ఈ ఘటనపై అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఆ విమానం బుధవారం గంటన్నర ఆలస్యంగా బయల్దేరింది. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం ఆరు గంటలకు ఆ విమానం బయలుదేరాల్సి ఉంది. ప్రయాణీకులు అందరూ తమ సీట్లలో కూర్చున్నారు.
అయితే పైలట్‌, సిబ్బంది సమయానికి రాకపోవడంతో ఆలస్యమైంది. ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. అదే విమానంలో ఉన్న అశోక్‌ గజపతిరాజును చుట్టుముట్టి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కేంద్రమంత్రి వెంటనే ఎయిర్ ఇండియా చీఫ్‌ ప్రదీప్‌ ఖరోలాకు ఫోన్‌ చేశారు. ఆలస్యంపై ఆరా తీశారు.
అయితే మంచు ఎక్కువగా ఉండటంతో విమానాన్ని ఆపినట్లు ఎయిర్ ఇండియా అధికారులు తొలుత చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని గ్రౌండ్‌ సిబ్బందికి చెప్పడం ఆలస్యమైందని, దీంతో వారు ప్రయాణికులను ఎక్కించుకున్నారని చెప్పారు. అంతేగాక భద్రతా తనిఖీల కారణంగా పైలట్‌ కూడా 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చినట్లు వెల్లడించారు

Category

🗞
News

Recommended