సోనియా గాంధీ రాజకీయాలకు గుడ్‌బై

  • 7 years ago
Sonia Gandhi announced retirement from politics a day before her son Rahul Gandhi's crowning as Congress president.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అధ్యక్షురాలిగా పని చేసిన సోనియా గాంధీ రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారు. ఈ మేరకు ఆమె రాజకీయాల నుంచి వైదొలగాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న క్రమంలో సోనియా తన రిటైర్మెంట్ ప్రకటించారు. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షులుగా శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. శుక్రవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై, ఆ తర్వాత వాయిదా పడ్డాయి. సభ వాయిదా అనంతరం ఆమె తిరిగి వెళ్తుండగా ఓ విలేకరి ఆమెను ప్రశ్నించారు. రాహుల్ బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మీ పాత్ర ఎలా ఉంటుందని అడిగారు. దానికి సోనియా.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు.
సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి 19 ఏళ్లకు పైగా అధ్యక్షురాలిగా ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులుగా ఇంతకాలం ఉన్న వారు ఎవరూ లేరు. ఎక్కువకాలం పార్టీ బాధ్యతలు భుజాన మోసిన అధినేత్రిగా ఆమె రికార్డ్ సృష్టించారు. ఇప్పుడు రాహుల్ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు.185 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్రం రాకముందు కొంతమంది విదేశీయులు అధ్యక్షులుగా ఉన్నారు. కానీ స్వాతంత్ర్యం వచ్చాక తొలి విదేశీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.

Recommended