Controversial filmmaker Ram Gopal Varma, who has courted controversy with many films, again with another, recently Kadapa webseries title song released.
పైత్యం అనుకున్నా సరే.. పొగరు అనుకున్నా సరే.. రాంగోపాల్ వర్మకు అవేమి పట్టవు. చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేయడం.. తీయాలనున్నది తీసి చూపించేయడం.. ఆయన శైలికి నిదర్శనం.
తన మైండ్‌సెట్‌కు రక్తపాతం, మాఫియా, డార్క్ బ్యాక్ డ్రాప్.. లాంటి సబ్జెక్టులు మాత్రమే కనెక్ట్ అవుతాయని, లవ్ స్టోరీలు, ప్యామిలీ స్టోరీలు గట్రా తనవల్ల కాదని కుండబద్దలు కొట్టే వర్మ.. తనకు నచ్చిన సబ్జెక్టును మాత్రమే తెరకెక్కిస్తారు. దర్శకుడిగా తనకు అనిపించి తీయడమే తప్ప.. ప్రేక్షకుడి కోణం ఆయనకు అనవసరం. అందుకే.. చూస్తే చూడండి.. లేకపోతే లేదని నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పేయగలడు. ఇప్పుడు 'కడప' వెబ్ సిరీస్ తోనూ ఆయన అదే చెప్పదలుచుకున్నారు.
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న కడప వెబ్ సిరీస్ కు సంబంధించి దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా టైటిల్ సాంగ్ విడుదల చేశారు. గీత రచయిత సిరాశ్రీ రాసిన ఈ పాటలో 'కడప' అంటేనే.. కేరాఫ్ ఫ్యాక్షన్ అన్నట్లుగా లిరిక్స్ ఉన్నాయి.
రాయలసీమ ఫ్యాక్షన్ అంటే.. అది ఏ ఒక్కరికో పరిమితమైనది కాదు. చాలామంది రాజకీయ నాయకులకు కూడా అందులో హస్తం ఉంది. పరోక్షంగా ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పరిటాల రవి లాంటి పేర్లను టచ్ చేసిన వర్మ.. తన వెబ్ సిరీస్ లో ఎవరి నేపథ్యాన్ని టచ్ చేయబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.

Category
🎥
Short film