రామసేతు పై మీడియా, గవర్నమెంట్ రెండు మాటలు !

  • 7 years ago
A video tweeted by Science Channel on December 11 has being widely circulated as fresh evidence to support the theory that a rock formation in the Bay of Bengal off the coast of Rameswaram is actually the bridge that Lord Ram and his army built to reach Sri Lanka, as described in the Ramayana.

ఒక అమెరికా సైన్సు టీవీ ప్రోమోతో భారతదేశంలో 'రామసేతు' వివాదంపై మరోసారి వేడి రాజుకుంది. అమెరికాకు చెందిన సైన్స్ చానల్ ఒకటి డిసెంబర్ 11న ట్విటర్‌లో 'రామసేతు' బ్రిడ్జి పై ఒక ప్రోమోను విడుదల చేసింది. సైన్స్ చానెల్ ప్రోమోతో రామసేతు అనుకూలవాదులు, నేతలు, రాజకీయ పార్టీల మధ్య మరోసారి చర్చ ప్రారంభమైంది. అయితే మీడియా, గవర్నమెంట్ ప్రతిసారి రామసేతు పై రెండు నాలుకల ధోరణి ఎందుకు ప్రదర్సిస్తుందో అని ఇప్పుడంతా చర్చ నడుస్తుంది. అమెరికా సైన్సు టీవీ ప్రోమో రిలీజ్ చేసిన తర్వాత మళ్లి దానిగురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని కూడా రాజకీయానికి వాడుకుంటున్న పరిస్థితి. అయితే కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ వేసేసి, విజువల్ ఎఫెక్ట్స్ వేసి ప్రోమో విడుదల చేసేసి అందరి లోను ప్రశ్నలు లేవనెత్తుతుందని సైన్స్ చానెల్ పై విమర్శలు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది.
ఇక్కడ సహజంగా ఏర్పడిన ఇసుక 4 వేల ఏళ్ల నాటిది. కాగా, ఏడు వేళ్ల ఏళ్ల క్రితం ఏర్పడిన రాళ్లను వేరే చోటు నుంచి ఇక్కడికి తరలించారని సైన్స్ ఛానెల్ స్పష్టం చేసింది. ఉపగ్రహ ఛాయాచిత్రాలను బట్టి చూస్తే మనుషులే దీన్ని నిర్మించినట్లు స్పష్టమవుతోంది. పరిశోధకుల కథనం ప్రకారం ఇది ఐదువేల ఏళ్ల కిందటి నాటిది. అని ఆ వీడియోలో ఓ శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు.

Recommended