• 7 years ago
A 23-year-old woman has accused Kannada movie actor Subramanya for allegedly. she fell unconscious on being offered a soft drink by the actor. The accused is currently absconding.

చిత్ర సీమలో అత్యాచారాలపై తారలు గొంతెత్తుతున్న తరుణమిది. గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపులపై 'మీ టూ' అనే హాష్ ట్యాగ్ ద్వారా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఓ సామాన్య మహిళ తనపై ఓ నటుడు అత్యాచారం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. కన్నడ ఇండస్ట్రీలో ఇప్పుడు దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏంటీ వివాదం..
హెంబణ్ణ చిత్రం ద్వారా కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన నటుడు సుబ్రహ్మణ్య తనపై అత్యాచారం చేశాడని 23ఏళ్ల ఓ యువతి బసవగుడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
నిజానికి ఆ యువతి, నటుడు సుబ్రహ్మణ్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతి ఇంట్లో వాళ్లను కూడా సుబ్రహ్మణ్య ఒప్పించాడు. అయితే తన చిత్రం హెంబణ్ణ రిలీజ్ కు సిద్దమవడంతో.. కొన్నాళ్లు పెళ్లి వాయిదా వేద్దామన్నాడు.
అయితే హెంబణ్ణ చిత్రం విడుదలై మంచి గుర్తింపు వచ్చిన తర్వాత కూడా సుబ్రహ్మణ్య ఆ యువతిని పెళ్లి చేసుకోలేదు.

Recommended