• 6 years ago
"Dear zbigsbujji, My dear little friend Thankyou for your New Year gift. Your message has reached me.May God bless you!" - Pawan Kalyan tweeted.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమాలో కొడకా కోటేశ్వర్ రావు అనే పాట పాడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31న సాయంత్రం ఈ పాట విడుదలవ్వగా ఇప్పటికే 8.3 మిలియన్ హిట్స్ వచ్చాయి. అయితే ఈ పాటను యూకెలో ఉంటున్న పోలండ్ బుజ్జిగాడు పాడటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు తెలుగు తెలియని 8 ఏళ్ల జెబిగ్స్ బుజ్జి అనే కుర్రాడు ముద్దు ముద్దుగా ఆ పాట పాడటం అందరినీ ఆకట్టుకుంది.
"డియర్ జెబిగ్స్ బుజ్జీ... మై డియర్ లిటిల్ ఫ్రెండ్, పాట రూపంలో నువ్విచ్చిన న్యూ ఇయర్ గిఫ్టుకు థాంక్స్. నువ్వు పంపిన సందేశం నాకు చేరింది. గాడ్ బ్లెస్ యూ'' అంటూ పవన్ కళ్యాణ్ తన మూవీస్ యాక్టివిటీ ట్విట్టర్ పేజీలో జెబిగ్స్ బుజ్జికి ట్వీట్ చేశారు.
స్వయంగా పవన్ కళ్యాణ్ నుండి రిప్లై రావడంతో పోలండ్ పోరగాడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. తాను సెవెంత్ హెవెన్లో తేలియాడుతున్నట్లు ట్వీట్ చేశాడు.
అంతే కాదు... జనవరి 9వ తేదీన పవన్ కళ్యాణ్ ఆంథెమ్ విడుదల చేస్తానని, దీన్ని తానే స్వయంగా కంపోజ్ చేసి పాడుతానని పోలండ్ కుర్రాడు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

Recommended