• 7 years ago
Are celebrities Good Role Models for Teenagers? questions Tollywood Veteran Director Tammareddy Bharadwaj. He responds on TV Anchor Pradeep Manchiraju's Drunk & Drive Case & Singer Ghazal Srinivas, who was arrested on a charge of harassment levelled against him by a female radio jockey

'కొత్త సంవత్సరం కొత్త విషయాలు మాట్లాడుదామని అనుకున్నాను కానీ... కొత్తవి కనిపించడం లేదు.
‘నా ఆలోచన' పేరుతో సమాజంలో జరిగే పరిణామాలను విశ్లేషించే తమ్మారెడ్డి తాజాగా గజల్ శ్రీనవాస్ బూతు భాగోతం, ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు విషయం గురించి ప్రస్తావించారు.
‘‘గజల్ శ్రీనివాస్‌ని పట్టుకున్నారు. సంతోషం. తప్పుచేశాడు.. జైలుకి పంపించేశారు.. బాగుంది. కానీ ఆ వీడియోలు మొత్తం టీవీల్లో గానీ, సోషల్ మీడియాలో మళ్లీ మళ్లీ పగలూరాత్రీ అనే తేడా లేకుండా చూపించారు. మామూలుగా ‘ఏ' సర్టిఫికెట్ సినిమాలనే రాత్రి పదకొండు తర్వాత వేయాలని అంటాం. కానీ గజల్ శ్రీనివాస్ xxx వీడియోస్ రాత్రి పగలు అని తేడా లేకుండా చూపించారు. న్యూస్ వేసుకోవచ్చు. కానీ ఇలాంటి వీడియోస్ ప్రసారం చేయవచ్చా? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.
ఇలాంటి అసాంఘిక చర్యలు జరిగినప్పుడు వాటిని ఎలా అరికట్టాలో చెప్పడం మీడియా బాధ్యత. అంతేతప్పా, ఆ సంఘటనలను అదేపనిగా ఇలా జరిగిందని చూపెట్టడం సబబు కాదు. ఇలా జరిగింది, అలా జరిగింది అని దాన్ని చూపిస్తూ ఉంటే ఆశ లేనోళ్లు, అవకాశం ఉన్నవాళ్లు కొత్తగా ఆశలు పెంచుకునే అవకాశం ఉంది. అటువంటిది ఏమిటో తెలియని వాళ్లు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఇది పద్దతిగా లేదు అని నా ఫీలింగ్.... అని తమ్మారెడ్డి అన్నారు.

Recommended