రాజశేఖర్ కూతురు డిసైడ్ అయిపోయిందట..?

  • 6 years ago
Chetan Bhagat's best-selling novel named 2 States was adapted as a film by director Abhishek Varman. The Hindi flick saw Arjun Kapoor and Alia Bhatt playing the lead roles alongside Ronit Roy, Amrita Singh, Revathi and Shiv Kumar Subramaniam in supporting roles.

టాలీవుడ్‌లో హీరోల వారసులు రంగ ప్రవేశం చేయడమే చూశాం. హీరోల కూతుర్లు హీరోయిన్లుగా వచ్చిన దాఖలాలు కూడా తక్కువే. తాజాగా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరో కూతురు శివానీ సినీ రంగం ప్రవేశం చేస్తున్నదనే వార్త మీడియాలో అప్పట్లో వైరల్ అయింది. అయితే తాజాగా మరోసారి శివానీ ఎంట్రీ న్యూస్ వైరల్ అవుతున్నది.
గతంలో ఓ తమిళ చిత్రంలో నటించేందుకు శివానీ అంగీకరించారనే వార్త వచ్చింది. కానీ ప్రస్తుతం తెలుగు చిత్రంలో నటించనున్నారనేది తాజా సమాచారం.
బాలీవుడ్‌లో విజయవంతమైన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ జరుగుతున్నది. తాజాగా హిందీలో వచ్చిన 2 స్టేట్స్ అనే చిత్రంలో శివానీ నటిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.
2 కంట్రీస్ చిత్రంలో అర్జున్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు. రెండు రాష్ట్రాలు, రెండు విభిన్నమైన సంస్క‌‌‌ృతుల ఉన్న కుటుంబాల మధ్య జరిగిన పెళ్లి నేపథ్యంగా కథ సాగుతుంది.
ఈ చిత్రంలో అలియాభట్ పోషించిన పాత్రను శివానీ చేస్తున్నట్టు సమాచారం.