ఈ విషయం వింటే షాకే ! మరీ అంత తక్కువ ?

  • 7 years ago
As soon as the post production works are also completed 2.O will go to the censor certification in Telugu, Tamil, Hindi and Arabic languages. As per the latest flash, the runtime of the movie is going to be 100 minutes.

గతేడాది భారత దేశ ప్రజలంతా 'బాహుబలి-2' కోసం ఎంతలా ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా తర్వాత 2018లొ ఇండియన్ సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '2.0'. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రజనీకాంత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా రూ. 450 కోట్ల ఖర్చుతో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన 2.0 చిత్రం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ‘2.0' మూవీ రన్ టైమ్ తెలిసి అభిమానులు షాకవుతున్నారు. ఇండియన్ ప్రేక్షకులకు సినిమా కనీసం రెండున్న గంటలు ఉంటే తప్ప చూసినట్లు ఉండదు. ఒకప్పుడు 3 గంటలు సినిమా ఉండేదు. ఇప్పుడు అన్నీ దాదాపు రెండున్నర గంటలకు తక్కువ కాకుండా సిమాలొస్తున్నాయి. ఎప్పటి నుండో మనం ఈ పార్మాట్ కు అలవాటు పడ్డాం. అయితే ‘2.0' మూవీ రన్ టైమ్ 2 గంటలు కూడా ఉండటం లేదని సమాచారం.
2.0 మూవీ రన్ టైమ్ కేవలం 100 నిమిషాలే అని తెలుస్తోంది. అంటే దాదాపు గంటన్నర. హాలీవుడ్ సినిమాలు మాత్రమే ఇంత తక్కువ రన్ టైమ్ తో ఉంటాయి. హాలీవుడ్ స్థాయిలో సినిమా తీస్తున్నట్లు చెప్పిన దర్శకుడు శంకర్.... సినిమా నిడివి విషయంలో కూడా హాలీవుడ్ నే ఫాలో అయినట్లు ఉన్నారు.

Recommended