చరిత్రలో తొలిసారి 4గురు జడ్జిల ప్రెస్‌మీట్..!

  • 7 years ago
4 judge supreme court meet press first time indian history live updates.

భారత దేశ చరిత్రలో తొలిసారి సుప్రీం కోర్టు జడ్జిలు శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వారు న్యాయవ్యవస్థలోని అవినీతిపై మాట్లాడుతున్నారు. నలుగురు జడ్జిలు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం తొలిసారి. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నివాసంలో నలుగురు జడ్జిలు మీడియాతో మాట్లాడారు. సుప్రీం చీఫ్ జస్టిస్ పైన ఈ జడ్జిలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు గౌరవాన్ని రక్షించాల్సి ఉందన్నారు.
సమస్యలను పరిష్కరించాలని తాము ప్రధాన న్యాయమూర్తిని అడిగామని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. అయినా ప్రయోజనం లేకపోయిందన్నారు. సుప్రీం కోర్టులో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయన్నారు. అందుకే తాము ప్రజల ముందుకు వచ్చామని చెప్పారు. సుప్రీం కోర్టులో పాలనా వ్యవహారాలు సరిగా సాగడం లేదన్నారు.
స్వతంత్రంగా వ్యవహరించే ప్రధాన న్యాయమూర్తి అవసరమని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపైన ఉందని చెప్పారు. సుప్రీం పవిత్రతను కాపాడకుంటే ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు అన్నారు.
సుప్రీం కోర్టులో ప్రధాన కోర్టు అడ్మినిస్ట్రేషన్ పద్ధతి సరిగా లేదని చెప్పారు. ప్రజలకు తెలియజేయాలనే తాము మీడియా ముందుకు వచ్చామని చెప్పారు. ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలా లేదా అనేది దేశ ప్రజలు తెలియజేయాలన్నారు. ఇలాగే ఉంటే ప్రజాస్వామ్యం ఫరిడవిల్లదని చెప్పారు.

Recommended