‘పద్మావత్’ వివాదం పై.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు సుప్రీం కోర్టు షాక్ !

  • 6 years ago
The Supreme Court on Thursday stayed the ban on the release of the film 'Padmaavat' imposed by four states, allowing for an all-India release on January 25.

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన 'పద్మావతి' చిత్రంపై కొన్ని రోజులుగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ వివాదాలన్నీ దాటుకుని, సెన్సార్ అడ్డంకులు తొలగించుకుని.... 'పద్మావత్' గా పేరు మార్చుకుని జనవరి 25న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని..... రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా రాష్ట్రాలు శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అడ్డుకోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది.
శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల్సిన బాధ్య‌త రాష్ట్రాల‌దేన‌ని, ఆ కార‌ణంతో ‘పద్మావత్' సినిమా విడుద‌లను అడ్డుకోవ‌డం తగదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.
ఆయా రాష్ట్రాల్లో నిషేదం నేపథ్యంలో ‘పద్మావత్‌' నిర్మాతలు సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో సుప్రీం గురువారం తీర్పునిస్తూ నాలుగు రాష్ట్రాల్లో సినిమాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశించింది.
సుప్రీం కోర్టు తీర్పుతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం ఎంతో మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.
సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి మొద‌ట్నుంచి ఆటంకాలే ఎదుర‌వుతున్నాయి. రాజ్‌పుత్ రాణుల ఆత్మ‌గౌర‌వానికి భంగం క‌లిగించేలా సినిమా ఉండ‌బోతోంద‌ని క‌ర్నిసేన, కొన్ని హిందూ సంఘాలు ఈ చిత్రంపై ఆందోళన చేయడంతో సెన్సార్ బోర్డు చరిత్ర కారుల సమక్షంలో ఈ చిత్రాన్ని సెన్సార్ చేసి సర్టిఫికెట్ జారీ చేసింది.

Recommended