సన్నీ లియోన్‌ పాపులారిటీ మామూలుగా లేదుగా

  • 7 years ago
ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో సన్నీ లియోన్ హవా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అమెరికన్ పోర్న్ స్టార్ అయిన సన్నీ లియోన్ హిందీ బిగ్ బాస్ షో ద్వారా ఇండియాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అలా సినిమా అవకాశాలు దగ్గించుకుని బాలీవుడ్లో టాప్ స్టార్‌గా ఎదిగింది. సన్నీ లియోన్ ఇండియాలో బాగా పాపులర్ కావడంతో... ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ వారు ఢిల్లీలోని తమ మ్యూజియంలో సన్నీ లియోన్ మైనపు విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ లో సన్నీ లియోన్‌కు చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ లాంటి ప్రముఖల సరసన ఇపుడు సన్నీ లియోన్ మైనపు విగ్రహం కూడా చేరనుంది.
అయితే మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు ముంబైలో సన్నీ లియోన్ ను కలిసి దాదాపు 200 మెజర్మెంట్స్ తీసుకున్నారు. త్వరలో మనం అచ్చం సన్నీ లియోన్‌ను పోలిన విగ్రహాన్ని టుస్సాడ్స్ మ్యూజియంలో చూడబోతున్నాం. మేడమ్ టుస్సాడ్స్ వారు తనను సంప్రదించడంతో సన్నీ లియోన్ థ్రిల్లయింది. తన మైనపు విగ్రహాన్ని ఢిల్లీ మ్యూజియంలో ప్రతిష్టించడం చాలా సంతోషంగా ఉందని, ఇది తన జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేని అనుభూతి అని సన్నీ లియోన్ తెలిపారు.
అయితే సన్నీ లియోన్ భారత సంతతి బ్యూటీ కావడంతో ఆమె ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో త్వరగా కలిసిపోయింది. గత కొన్నేళ్లుగా గూగుల్ లో ఇండియన్స్ అత్యధికంగా సెర్చ్ చేస్తున్న సెలబ్రిటీగా సన్నీ లియోన్ నిలుస్తున్న సంగతి తెలిసిందే.

Recommended