A CI thrashed for extramarital affair with lady ASP at kukatpally in Hyderabad.
ఇద్దరు పోలీసు అధికారుల మధ్య ఉన్న వివాహేతర బంధం బట్టబయలైంది. ఈ ఘటన నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో కలకలం సృష్టించింది. తన భార్యతో కల్వకుర్తి సీఐ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ.. అవినీతి వ్యతిరేక విభాగంలో ఏఎస్పీగా పనిచేస్తున్న అధికారిణి భర్త, తన బంధువులతో కలిసి అతనిపై దాడికి పాల్పడ్డాడు.
ఓ ఇంట్లో తన భార్యను, సీఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆయన.. నడిరోడ్డుపై సీఐని చితక్కొట్టాడు. ఏఎస్పీ తల్లి, అత్త.. ఆ సీఐని చెప్పులతో కొట్టారు.
ఈ విషయంపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఏఎస్పీ, సీఐల వైఖరిపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తన భార్యను సీఐ ట్రాప్ చేశాడని, గత రెండేళ్లుగా వారి మధ్య సంబంధం ఉందని ఏఎస్పీ భర్త ఆరోపించాడు.
తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, అయితే తన భార్య బాగోతం బయటపెట్టాలనే ఉద్దేశంతోనే వారిని పట్టుకున్నానని ఆయన తెలిపారు. వీరిద్దరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆ సీఐ ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడని, అతడ్ని కఠినంగా శిక్షించాలని మహిళా ఏఎస్పీ తల్లి, అత్త కోరారు. తమ కూతురు జీవితాన్ని నాశనం చేశాడని ఏఎస్పీ తల్లి కన్నీటిపర్యంతమైంది.

Category
🗞
News