త్వరలోనే 'జీఎస్‌టీ-2' వర్మ సంచలనం..!

  • 6 years ago
Just two days after Ram Gopal Varma released online his controversial film GST, starring American pornstar Mia Malkova, the director on Monday announced that he will soon come up with “GST2”.

క్రైమ్, మాఫియా కిక్ నుంచి బయటపడ్డ ఆర్జీవి.. ఇప్పుడు 'సెక్స్' కంటెంట్‌లో ఆ కిక్‌ను వెతుక్కుంటున్నారు. 'జీఎస్‌టీ'తో బహుశా డబుల్ కిక్ వచ్చిందేమో.. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో 'జీఎస్‌టీ 2'కి కూడా సిద్దమైపోయారు. తన ట్విట్టర్ ఖాతా నుంచి వర్మ తాజాగా ఈ ప్రకటన చేశారు.
" 'గాడ్ సెక్స్&ట్రూత్'కు అద్భుతమైన స్పందన రావడంతో.. త్వరలోనే జీఎస్‌టీ-2 మొదలుపెట్టబోతున్నాను.ఆ భగవంతుడు నాతో పాటు నా జీఎస్‌టీ లవర్స్ వైపు ఉంటాడని ఆశిస్తున్నా' అంటూ వర్మ ట్వీట్ చేశారు.
జీఎస్‌టీ-2 అంటూ ప్రకటించేశాడు కానీ.. ఇందులోనూ మియా మాల్కోవానే చూపించబోతున్నాడా?.. లేక మరో పోర్న్ స్టార్‌తో చేయబోతున్నాడా? అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఏదేమైనా.. జనం వద్దన్న పని చేయడం వర్మకు కిక్ ఇచ్చే విషయం కాబట్టి.. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాల్ని ఆయన లెక్క చేయట్లేదు.
జనవరి 26వ తేదీ ఉదయం 9గం.కు 'జీఎస్‌టీ'కి ఎంత ట్రాఫిక్ పోటెత్తిందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పట్ల చాలామంది ఆసక్తి కనబర్చడంతో.. ఒక్కసారిగా సైట్ క్రాష్ అయిపోయింది. గడిచిన రెండు మూడు రోజుల్లో వేలాదిమంది జీఎస్‌టీ కోసం గూగుల్ సెర్చింజన్‌లో విపరీతంగా వెతికారు. ఇదే విషయాన్ని వర్మ సైతం తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. గూగుల్ సెర్చింజన్‌లో 'జీఎస్‌టీ' సెర్చ్ వర్డ్ టాప్‌లో ఉందని పేర్కొన్నారు.

Recommended