• 6 years ago
Andhra Pradesh minister Somireddy Chandramohan Reddy, Andhra Pradesh minister Kinjarapu Atchannaidu lashed out at YS Jaganmohan Reddy for resignation issue.

రాజీనామాలంటూ మరోసారి కొత్త నాటకానికి తెరతీశారంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ రాజీపడబోదని స్పష్టం చేశారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 2016 నుంచి మూడు బడ్జెట్లు అయిపోయాయని, అప్పుడెందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఈ మూడేళ్లు పడుకున్నావా? అంటూ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. హోదా ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని 2016లోనే ప్రకటించిన జగన్.. మాట తప్పారని అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంకెంత కాలం రాజీనామాల పేరుతో ప్రజలను మభ్యపెడతావంటూ వారు ధ్వజమెత్తారు.
బుధవారం సీఎం చంద్రబాబుతో సమావేశం అయిన అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో కేంద్రంతో రాజీ లేకుండా పోరాడుతున్నామని చెప్పారు. బీజేపీ మిత్రపక్షమైనా 29 సార్లు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కలిశారని, అన్ని ప్రయత్నాలు చేశారని సోమిరెడ్డి గుర్తు చేశారు.

Category

🗞
News

Recommended