Jagan Confused On Pawan Challenge

  • 6 years ago
YSR Congress Party chief YS Jagan Mohan Reddy in dilemma on No Confidence Motion.

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. అవిశ్వాసం పెడదామా, పెడితే వచ్చే లాభమేమిటి, నష్టమేమిటి అనే అంశాలపై తర్జన భర్జన పడుతున్నారని తెలుస్తోంది.
అవిశ్వాస తీర్మానంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సవాల్ విసరడం, దానికి వైసీపీ వెంటనే స్పందించడం, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు దీనిపై వెనక్కి తగ్గడం.. ఇన్ని పరిణామాల నేపథ్యంలో మనమే స్వీకరించిన సవాల్‌పై మౌనంగా ఉంటే బాగుండదని పార్టీలో చర్చ సాగుతోందట.
వైసీపీ, టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు కదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దానికి వెంటనే జగన్ సై అన్నారు. అందుకు తగ్గ మద్దతును తాను కూడగడతానని పవన్ ధీటుగా స్పందించారు. దీంతో ఇప్పుడు మనం మౌనంగా ఉండటం సరికాదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది.
పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా పవన్ ప్రకటనకు స్పందించి ఆవేశపడ్డారనే చర్చ కూడా వైసీపీలో సాగుతోందట. ఇతర నేతలు స్పందిస్తే దానిని పవన్ సీరియస్‌గా తీసుకోకపోయి ఉండేవారని, జగనే స్వయంగా చెప్పడమే ఇరకాటంలో పడేసిందని అంటున్నారట.
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ తాను ఎంపీల మద్దతు కూడగడతానని చెప్పారు. దీనిపై జగన్ పార్టీ నేతలతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. మార్చి 21వ తేదీన అవిశ్వాస తీర్మానం పెడతామని అంబటి రాంబాబు మంగళవారం ప్రకటించారు. ఇదే ముహూర్తమని చెబుతున్నారు. అయితే, టీడీపీ కూడా కలిసి రావాలని, అందుకు పవన్ ఒప్పించాలని మెలిక పెట్టడం గమనార్హం.

Recommended