• 6 years ago
Juvva Movie which is currently a hot topic in social media. Though the expectations are less on it, the makers are confident that it will become a hit. Initially, the title Juvva was not finalized. But we all know how big of a hit, jinthaktha tha song from Rajamouli's Vikramarkudu became. So, the makers thought of keeping Jinthaktha tha as the title.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'విక్రమార్కుడు' సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాతో పాటు ఇందులో పాటలు కూడా సూపర్ హిట్. ముఖ్యంగా 'జింతాత చిత చిత జింతాతతా' పాట అయితే అప్పట్లో టాపు లేపింది. కొన్ని రోజుల తర్వాత 'జింతాత తా' పేరుతో సినిమా వస్తున్నట్లు కూడా మనకు వార్తలు వినిపించాయి. ఈ వార్తల వెనక అసలు స్టోరీ తాజాగా వెలుగులోకి వచ్చింది.
రాజమౌళి దగ్గర అసిస్టెంటుగా పని చేసిన త్రికోటి దర్శకుడిగా మారి గతంలో `దిక్కులు చూడ‌కు రామయ్య‌` అనే చిత్రం చేశారు. ఇదే దర్శకుడు ఇపుడు ‘జువ్వ' అనే చిత్రాన్ని తెరకెక్కించారు.
‘జువ్వ' చిత్రానికి మొదట ‘జింతాత తా' అనే టైటిల్ పెడదామనుకున్నారట నిర్మాతలు. ఇదే విషయాన్ని త్రికోటి, రాజమౌళి దృష్టికి తీసకెళితే వద్దని చెప్పారట. ‘జింతాతతా' అనేది ఫన్నీ వర్డ్ అని, దీన్ని టైటిల్‌గా పెడితే ప్రేక్షకులు ఇది ఎలాంటి సినిమానో అర్థంకాక కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్పారట.
జువ్వ' సినిమా పోస్టర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అందుకు కారణం ఈ సినిమా పోస్టర్లపై మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు ఉండటమే. ఈ సినిమా ద్వారా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బంధువు రంజిత్ హీరోగా పరిచయం అవుతున్నాడు.
రంజిత్, పాల‌క్ ల‌ల్వానీ హీరో, హీరోయిన్ల‌గా న‌టిస్తోన్నరు .ఎస్. వి. ర‌మ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో సొమ్మి ఫిలింస్ పై డా. భ‌ర‌త్ సోమి నిర్మిస్తున్నారు. ఎమ్. ఎమ్. కీర‌వాణి సంగీతం స‌మ‌కూర్చారు. ఈ సినిమా ఫిబ్రవరి 23న విడుదలవుతోంది.

Recommended