• 7 years ago
దుబాయ్ పోలీసులు శ్రీదేవి భౌతికకాయాన్ని మంగళవారం ఎంబామింగ్‌కు ఇచ్చారు. ఆ తర్వాత దర్యాఫ్తు పూర్తయిందని, శ్రీదేవి మృతి కేసులో ఎలాంటి అనుమానాలు లేవని, ప్రమాదవశాత్తూ ఇది జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు.
శ్రీదేవి శనివారం రాత్రి చనిపోయినప్పటికీ దుబాయిలో అన్ని పూర్తయేసరికి మంగళవారం అయింది. అంటే రెండున్నర రోజులకు పైగా తీసుకుంది.దుబాయ్ పోలీసులకు అత్యాధునిక పరికరాలు, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ అందుబాటులో ఉంది.
అమెరికా వంటి అగ్రదేశాల్లో ఉండే ల్యాబ్‌కు తీసిపోని విధంగా దుబాయ్ ల్యాబ్ ఉంటుందట. అత్యాధునిక పరికరాలన్నీ ఉంటాయి. కచ్చితమైన, అగ్రశ్రేణి విచారణ జరుపుతుందన్న రికార్డు కూడా ఇక్కడ ఉంది.
కొన్ని కేసులను గంటల్లోనే చేధించిన సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వీధిలో ఈ అత్యాధునిక ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ ఉంది. ఎలాంటి కష్టమైన కేసు అయినా పోలీసులు ఈ ల్యాబ్ సాయంతో ఛేదిస్తారట.
రసాయన, నార్కోటిక్ పరీక్షలు, నేరం జరిగిన ప్రాంతంలో ఆధారాల సేకరణకు పరికరాలు, వేలిముద్రలు, కంప్యూటర్ ఫోరెన్సిక్, డీఎన్ఏ టెస్ట్, ఆడియో, వీడియో పరిశీలన వంటి అన్ని రకాల టెస్టులు చేస్తారు. తక్కువ సమయంలో కచ్చితమైన నివేదికలు ఇస్తారనే రికార్డ్ ఉంది.
ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేస్తారు. శ్రీదేవి మృతి విషయంలో ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ నివేదికను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి పంపించారు. వాటిని పరిశీలిస్తారు. వీటి ఆధారంగా విచారణ ఉండాలా లేదా అనేది తేలుతుంది. అయితే, ఆమె ప్రముఖురాలు కావడం, పబ్లిక్ ప్రాసిక్యూషన్ తొలుత అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోనే శ్రీదేవి కేసు విషయంలో చాలా ఆలస్యం జరిగి ఉంటుందని అంటున్నారు.

Category

🗞
News

Recommended