ఆ బలహీనత నన్ను వదలడం లేదు....అంటున్న అమిర్‌

  • 6 years ago
Aamir Khan is one actor who has been very vocal about his smoking habit, and the fact that it is bad. He has also time and again stated that he wants to quit smoking, but has failed.

అందరూ ఆయన్ను మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అని పిలిస్తే.. ఆయన మాత్రం తనకూ ఓ బలహీనత ఉందని చెబుతున్నారు. ఆ బలహీనతను అధిగమించడానికి గతంలోనూ ప్రయత్నించి విఫలమయ్యారట. అయితే త్వరలోనే దాని నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తానని మాత్రం చెబుతున్నారు. ఇంతకీ ఏంటా బలహీనతా?.. ఎవరా వ్యక్తి?.
బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమిర్‌ ఖాన్ ఇటీవలే(మార్చి 14)న తన తన 53వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తనలోని ఓ బలహీనత గురించి బయటపెట్టారు. చాలాకాలంగా 'స్మోకింగ్' తనను బలహీనతలా వెంటాడుతోందని చెప్పారు.
నిజానికి గతేడాదే స్మోకింగ్ మానేయాలని అమీర్ గట్టిగా నిశ్చయించుకున్నారట. అనుకున్నట్టుగానే కొద్ది రోజులు స్మోకింగ్ కూడా మానేశారట. కానీ గతేడాదే విడుదలైన తన సినిమా 'దంగల్' భారీ విజయం సాధించడంతో మళ్లీ స్మోకింగ్ మొదలుపెట్టారట.
'ధూమపానం ఆరోగ్యానికి హానికరం' అన్న మాట విన్న ప్రతీసారి దానికి దూరంగా ఉండాలనుకుంటాను, స్నేహితులకూ అదే చెబుతాను.. కానీ ఎందువల్లో నేను మాత్రం స్మోకింగ్ మానేయలేకపోతున్నానని చెప్పారు అమీర్. మానేయాలని ప్రయత్నించిన ప్రతీసారి విఫలమయ్యానని అన్నారు. అయితే ఈసారి మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నానని, త్వరలోనే మానేయడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు.
ఇన్నాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌కు దూరంగా ఉన్న అమీర్.. ఇటీవలే అందులోనూ ఖాతా తెరిచారు. ఈ సందర్భంగా.. తన తల్లి పాత చిత్రాన్ని ఆయన షేర్ చేయడం విశేషం. తన తల్లి వల్లే ప్రస్తుతం తాను ఈ స్థాయికి వచ్చానని అందుకే ఆమె ఫోటోనే మొదటగా షేర్ చేస్తున్నానని తెలిపారు.భార్య కిరణ్ రావు వల్లే తాను ఇన్‌స్టాగ్రామ్‌లో చేరాల్సి వచ్చిందని వెల్లడించారు.

Recommended