• 6 years ago
Ileana sensational comments on her personal life. She do not like Gossip

సంచలన వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలిస్తున్న హీరోయిన్లలో ఇలియానా కూడా ఒకరు. సౌత్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగి ఇప్పుడు బాలీవుడ్ లో అరా కొర అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి వ్యాఖ్యలు చేసిన ఇలియానా తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. తన వ్యక్తిగత జీవితం వార్తల్లో గాసిప్స్ రూపంలో అసత్యాలతో ఉండడం తన్తకు ఇష్టం లేదని అందుకే నిజాలు మాట్లాడడానికె ఇష్టపడతానని ఇలియానా తెలిపింది.
ఇలియానా ఇటీవల బాలీవుడ్ హీరోలపై సంచనల వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్ లో బడా హీరోలే ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ ఘాటుగా కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ వేడి చల్లారక ముందే ఇలియానా మరో మారు తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది.
ఇలియానా తన ప్రియుడు నీబోన్ ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో బెస్ట్ హబ్బీ అని పేర్కొంది. తన వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడానికి గల కారణాలని ఇలియానా రీసెంట్ ఇంటర్వ్యూ లో వెల్లడించింది.
గాసిప్స్ పేరుతో అసత్య వార్తల్లో నిలవడం తనకు ఇష్టం లేదని ఇలియానా వెల్లడించింది. అందువలనే అన్ని విషయాలని మీడియాతో పంచుకుంటానని తెలిపింది. గతంలో తన గురించి అనేక పుకార్లు సృష్టించారు అని ఇలియానా వాపోయింది. అలాంటి వార్తలు తనకు నచ్చవని తెలిపింది
తన శరీరం గురించి, అందం గురించి అనేకరకాలుగా మర్లాడుకునేవారు ఉన్నారు. నేను గత 15 ఏళ్ల నుంచి బాడీ డిస్ మార్ఫిక్ డిస్ ఆర్డర్ సమస్యతో భాదపడుతున్నా. ఆ విషయాన్ని చెప్పుకోవడానికి తాను సిగ్గుపడను అని ఇలియానా ఇంటర్వ్యూలో తెలిపింది. తనగురించి అసత్యాలు రాసే వారికి ఇక అవకాశం ఇవ్వనని ఇలియానా తెలిపింది.

Recommended