CBSE Paper Leak Updates

  • 6 years ago
The Central Board of Secondary Education (CBSE) on Thursday decided to conduct re-exams for the Class 10 Mathematics paper and Class 12 Economics paper in view of the paper leaks. Students are seen protesting outside CBSE office in Delhi. They are saying that, ''They are suffering due to the mistakes of CBSE."

సిబిఎస్ఈ పరీక్షల కంట్రోలర్‌ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నాలుగు గంటల పాటు విచారించింది. లీకైన పేపర్ వేయి మందికి చేరినట్లు భావిస్తున్నారు. ప్రశ్నపత్రాలు లీకైన రెండు పరీక్షల తేదీలను సోమవారం లేదా మంగళవారం ప్రకటిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్ర ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. పిల్లల కోసం తాము పనిచేస్తున్నామని, పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని సిబిఎస్ఈ చైర్ పర్సన్ అనిత కార్వాల్ చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పిల్లలకు అనుకూలంగానే తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
సిబిఎస్ఈ ప్రశ్నపత్రాల లీక్ కేసులో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 35 మందిని ప్రశ్నించారు. వారిలో ఓ కోచింగ్ సెంటర్ (వికీ), 11 మంది విద్యార్థులు, 7గుు ప్రథమ సంవ్సంర విద్యార్థులు, ఐదుగురు ట్యూటర్లు, ఇద్దరు ప్రైవేట్ అధికారులు ఉన్నారు. వారందరికీ లీకైన ప్రశ్నప్రతం అందినట్లు తెలుస్తోంది. పదో తరగతి లెక్కల పరీక్షకు ముందు రోజు మార్చి 27వ తేదీన ప్రశ్న పత్రం లీకైనట్లు సిబిఎస్ఈకి ఓ ఈమెయిల్ వచ్చింది. పేపర్ లీక్‌పై పోలీసు కంట్రోల్ రూంకు కూడా ఓ కాల్ వచ్చింది.
దేశవ్యాప్తంగా ఉ్న సిబిఎస్ఈ కార్యాలయాలకు దర్యాప్తులు విస్తరించాయి. పేపర్ లీకేజీ వ్యవహారంలో వాట్సప్ గ్రూప్‌నకు ఓ లేడీ ట్యూటర్ అడ్మిన్‌గా వ్యవహరించినట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ప్రశ్న పత్రాలను డబ్బులకు విక్రయించారనే ఆరోపణలను పోలీసులు తిరస్కరిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరి నుంచి పది నుంచి 15 వేల వరకు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని ఓ జాతీయ మీడియా వార్తాకథనం తెలియజేసింది.

Recommended