Ramcharan Get Apreciated By Arvind Swamy

  • 6 years ago
Arvind Swamy wished Ram Charan and Rangasthalam team for movie success

రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మొదటి షో నుంచే ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పల్లెటూరి యువకుడిగా, వినికిడి లోపంతో రాంచరణ్ అద్భుతంగా నటించాడని ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రముఖుల నుంచి రంగస్థలం టీంకు శుభాకాంక్షలు అందుతున్నాయి. తమిళ నటుడు అరవింద్ స్వామి రంగస్థలం చిత్రం విజయానికి సంబందించిన విషయాన్ని చెబుతూ రాంచరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు.
రంగస్థలం చిత్రంలో దర్శకుడు సుకుమార్ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తోంది. 1980 నాటి పల్లెటూరి పరిస్థితులని కళ్ళకు కట్టినట్లు చూపించాడు.సుకుమార్ మ్యాజిక్ మరో మారు పనిచేసిందని అభిమానులు అంటున్నారు.
రంగస్థలం చిత్రానికి పాజిటివ్ టాక్ సొంతమైన విషయం సినీ ప్రముఖులందరికి తెలిసిపోయింది.సినీప్రముఖులు రాంచరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.తమిళ నటుడు అరవింద్ స్వామి రంగస్థలం చిత్రం గురించి స్పందించాడు. రంగస్థలం చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకున్న విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.
ధృవ చిత్రంలో అరవింద్ స్వామి రాంచరణ్ తో కలసి నటించిన సంగతి తెలిసిందే. ధృవ చిత్రంలో అరవింద్ స్వామి ప్రతినాయకుడి పాత్రలో జీవించాడు. ధృవ చిత్రం రాంచరణ్ కెరీర్ లో మంచి హిట్ మూవీగా నిలిచింది. రంగస్థలం చిత్రం విజయం సాధించిన సందర్భంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు, చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు.

Recommended