సల్మాన్‌ బెయిల్‌ పిటషన్‌పై విచారణ ,బెయిల్‌ మంజూరు

  • 6 years ago
A Jodhpur Court on Saturday (April 7) granted bail to Bollywood actor Salman Khan, who has been sentenced to five years in prison for targeting two blackbucks in 1998, today (April 7). The bail has been granted on a surety of Rs 50,000. As per reports, the actor's fans have begun their celebrations as the superstart is set to walk free

కృష్ణ జింకల కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌‌కు బెయిల్‌ మంజూరైంది. రూ. 50వేల పూచీకత్తుపై సల్మాన్ ఖాన్‌కు శనివారం జోధ్‌పూర్ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పటికే సల్మాన్ రెండ్రోజుల జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే.
కాగా, సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి రవీంద్ర కుమార్‌ జోషి బదిలీ నేపథ్యంలో తొలుత విచారణపై అనిశ్చితి నెలకొంది. కానీ, ఆయన శనివారం ఉదయం విధులకు హాజరై సల్మాన్‌ బెయిల్‌ పిటషన్‌పై విచారణ జరిపారు
తీర్పు మధ్యాహ్నం భోజన విరామం‌ తర్వాత వెల్లడించారు. కాగా సల్మాన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్‌ కోరింది. రెండు కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్‌ఖాన్‌కు గురువారం ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై శుక్రవారమే విచారణ జరగాల్సి ఉండగా సల్మాన్‌కు బెయిల్‌ ఇవ్వాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి కేసు పూర్తిగా పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తి జోషి శనివారానికి వాయిదా వేశారు. దీంతో గత రెండు రోజులుగా సల్మాన్‌ జైల్లోనే సాధారణ ఖైదీగా గడిపారు.

Recommended