సిరియాపై ఆంక్షల విషయంలో అమెరికా వెనక్కు తగ్గాలి : పుతిన్

  • 6 years ago
సిరియాపై అమెరికా దాడులకు తెగబడుతున్న తరుణంలో రష్యా మరోసారి అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది.సిరియాపై మరోసారి దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఆంక్షలు విధిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. సిరియాపై అమెరికా దాడులపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ తరహ దాడుల పట్ల రష్యా అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా తీరును నిరసిస్తూ రష్యా తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే ఈ తీర్మానం వీగిపోయింది. సిరియాపై అమెరికా దాడులను బ్రిటన్ సహ కొన్ని దేశాలు సమర్ధించాయి. నాలుగు దేశాలు మాత్రం వ్యతిరేకించాయి.
సిరియాపై అమెరికా దాడులను రష్యా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ తరహ దాడులు పునరావృతం చేస్తే చూస్తూ ఊరుకోబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. సిరియాపై మరోసారి దాడి చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన అమెరికాకు తేల్చి చెప్పారు. సిరియాపై ఆంక్షలు విధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడ ఆయన హెచ్చరించారు.
సిరియా అధ్యక్షుడు హసన్‌ రౌహనీతో ఫోన్‌‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. సిరియాపై పశ్చిమ దేశాల దాడులు, శాంతి చర్చలకు విఘాతం కల్గించేవిగా ఉన్నాయని పుతిన్‌తో రౌహన్ చెప్పారు.ఈ అభిప్రాయంతో పుతిన్ ఏకీభవించారు. ఐక్యరాజ్యసమితి నిబంధనావళిని ఉల్లంఘించేవిగా అమెరికా వ్యవహరిస్తోందని వారిద్దరూ అభిప్రాయపడ్డారు.
సిరియాపై ఆంక్షల విషయంలో అమెరికా వెనక్కు తగ్గాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిమాండ్ చేశారు. ఆంక్షలపై వెనక్కు తగ్గాలని పుతిన్ డిమాండ్ చేశారు.
అమెరికా మాత్రం ఆంక్షలపై తగ్గేలా కన్పించడం లేదు. సిరియాకు రసాయనిక ఆయుధాలను సరఫరాను చేస్తున్న సంస్థలను దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. అయితే అమెరికా ఆంక్షలు విధిస్తున్న సంస్థల్లో ఎక్కువగా రష్యాకు చెందినవిగా ఉన్నాయని అమెరికా అభిప్రాయపడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే తాము ఆంక్షలు విధించినట్టు అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రకటించారు.

Category

🗞
News

Recommended