Anitha Severe Comments On Industry Culture

  • 6 years ago
Naagin 3 actress Anita Hassanandani talks about indutry culture.She made sensational comments
#Anitha
#Naagin3
#Pawan kalyan
కాస్టింగ్ కౌచ్ పై గళం విప్పుతున్న హీరోయిన్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.మీ టూ క్యాంపైన్ తో హాలీవుడ్ ఇచ్చిన చైతన్యం వలన ఇండియాలోని నటీమణులు కూడా కాస్టింగ్ కౌచ్ పై క్రమంగా పోరాటం మొదలు పెడుతున్నారు.కాస్టింగ్ కౌచ్ వలన అర్థమైన నటీమణులు ఎదుర్కొంటున్న సమస్యలపై శ్రీరెడ్డి మొదలు పెట్టిన పోరాటం టాలీవుడ్ ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.అనవసరంగా పవన్ కళ్యాణ్ ని నిందించడం, ఈ కుట్ర వెనుక రాంగోపాల్ వర్మ ఉండడంతో కాస్టింగ్ కౌచ్ పోరాటం పూర్తిగా పక్క దారి పట్టేసింది.మరో హీరోయిన్ తాజగా కాస్టింగ్ కౌచ్ గురించి సంచనల వ్యాఖ్యలు చేసింది.
హీరోయిన్ అనిత తెలుగువారందరికీ సుపరిచితమైన హీరోయిన్. పలు తెలుగు చిత్రాల్లో ఆమె నటించింది. ఆమె నటించిన చిత్రాలలో చెప్పుకోదగ్గ చిత్రం నువ్వు నేను. ప్రస్తుతం ఈ భామ ముంబైలో టివి నటిగా రాణిస్తోంది. అనిత ప్రస్తుతం టివి షో నాగిన్ 3 లో నటిస్తోంది.
ఓ ఇంటర్వ్యూలో అనిత కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది.ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితి కాస్త నయం అని అనిత తెలిపింది. మా టైం లో అయితే కాస్టింగ్ కౌచ్ దారుణంగా ఉండేదని వాపోయింది.
కాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకోవడానికి నటీమణులు చాకచక్యంతో వ్యవహరించాలని అనిత పిలుపు ఇచ్చింది. తనకు కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని అనిత తెలిపింది. తనకు అదృష్టవ శాత్తు ఏక్తాకపూర్ వంటి మంచి నిర్మాత దొరకడంతో తాను మంచి పొజిషన్ లో ఉన్నానని అనిత తెలిపింది.

Recommended