Avengers infinity war Movie Review

  • 6 years ago
Superb response for Avengers Infinity War pre bookings. Avengers Infinity War ready for release on 27 Apri
మార్వల్ సూపర్ హీరోలంతా ఈ ప్రపంచాన్ని అతిపెద్ద విలన్ తానొస్ నుంచి రక్షించడమే ఈ చిత్ర కథ.
హాలీవుడ్‌లో సూపర్ హీరోస్ నేపథ్యంలో వచ్చిన 'ఐరన్ మ్యాన్', 'థోర్', 'కెప్టెన్ అమెరికా', 'గార్డెన్స్ ఆఫ్ ది గెలాక్సీ' తదితర చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.మార్వాల్ స్టూడియో సంస్థ నుంచి గతంలో ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా, స్పైడర్ మాన్ వంటి సూపర్ హీరో చిత్రాలు వచ్చాయి. వీరంతా ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్న చిత్రం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలవుతోన్న ఈ చిత్రం.. భారత్‌లోనూ కనీవిని ఎరగని స్థాయిలో 2 వేల థియేటర్లలో రిలీజ్ అవుతోంది. మార్వెల్‌ స్టూడియోస్‌ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కి ఈ సినిమా ఎలా ఉందో ‘సమయం’ రివ్యూ లోకి వెళ్లి చూద్దాం.
కెప్టెన్ అమెరికా సివిల్ వార్ సమయంలో ఎవరికి వారుగా విడిపోయిన అవెంజర్స్ అందరూ కలిసి ప్రపంచాన్ని మొత్తం తన అదుపులో పెట్టుకోవాలని చూసే థానోస్‌కు ఎదురు తిరుగుతారు. ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలంటే భూమి మీదున్న ఆరు విలువైన ఇన్ఫినిటీ స్టోన్స్‌ను తన వశం చేసుకునే ప్రయత్నంలో ఉన్న థానోస్‌ను అవెంజర్స్ అడ్డుకున్నారా..? అతి శక్తివంతుడైన థానోస్‌ను తట్టుకొని అవెంజర్స్ నిలబడిగలిగారా..? అనేదే సినిమా.
కెప్టెన్ అమెరికాగా నటించిన క్రిస్ ఎవాన్స్, ఐరన్ మ్యాన్‌గా కనిపించిన రాబర్ట్ డౌనే, థోర్‌గా నటించిన క్రిస్ హెమ్స్ వర్త్ లు తమదైన నటనతో మెప్పించారు.
క్లయిమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. థానోస్ పాత్రను డిజైన్ చేసిన తీరు, దాని కోసం వాడిన మేకప్ పర్ఫెక్ట్‌గా ఉంది. థోర్ తన ఆయుధాన్ని తిరిగి తయారు చేసుకొని దాడికి దిగే సన్నివేశాలు ప్రేక్షకులతో ఈలలు వేయించడం ఖాయం. బ్లాక్ పాంథర్ వర్గాన్ని తెరపై పరిచయం చేసే సీన్స్ మరో హైలైట్. 'గమొరా' అనే పాత్ర ద్వారా కథకు కొంత ఎమోషన్స్ జోడించడం బావుంది.

#Avengers: Infinity War
#Hollywood

Recommended