Teja to direct Rana Daggubati again. Teja planning for war backdrop movie
కెరీర్ ఆరంభంలో జయం, నువ్వు నేను వంటి ప్రేమ కథాచిత్రాలతో ప్రతిభగల దర్శకుడిగా తేజ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాల పాటు తేజకు సరైన విజయం దక్కలేదు. గత ఏడాది రానా దగ్గుబాటి హీరోగా నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని తెరకెక్కించాడు. రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దీనితో దర్శకుడిగా తేజ ప్రతిభ మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కించడం అంటే కత్తిమీద సాము లాంటి వ్యవహారమే. ఎన్టీఆర్ జీవిత చరిత్రతో అనేక రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నాయి. అలంటి చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం తేజకు దక్కడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అంతలోనే తేజ ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఎలా చెప్పాలి అనే విషయంలో బాలయ్యతో తేజ విభేదించారట. ఈ చిత్రం నుంచి తేజ తప్పుకోవడానికి ప్రధాన కారణం ఇదే అని వార్తలు వస్తున్నాయి.
నేనే రాజు నేనే మంత్రి వంటి రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాన్ని విజయవంతం చేసిన తేజ మరో మారు ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 1971 ఇండియా, పాక్ వార్ నేపథ్యంలో చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడట.
# RanaDaggubati
#Teja

Category
🎥
Short film