అధికార పార్టీకి ధీటైన స‌మాధానం ఇచ్చినందుకేనా??

  • 6 years ago
The charming leader in congress party mr revanth reddy maintaining distance with the party. he disappointed with party leaders behavior. revanth alleged the seniors trying to keep him in the dark side. thats why he wants keep away from the 3rd time bus tour in telangana.
#RevanthReddy
#UttamKumarReddy
#JanaReddy
#TCongress

తెలంగాణ కాంగ్రేస్ పార్టీలో విభాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి స‌రైన గుర్తింపు ఇవ్వ‌క పోగా మూడ‌వ విడ‌త త‌ల‌పెట్టిన బ‌స్సు యాత్ర‌కు స‌రైన ఆహ్వానం పంప‌లేదు రాష్ట్ర నాయ‌కత్వం. దీంతో బ‌స్సు యాత్ర‌కు దూరంగా ఉండాల‌ని రేవంత్ నిర్ణ‌యించుకున్నారు. కావాల‌నే కాంగ్రేస్ పార్టీ రేవంత్ రెడ్డిని దూరం పెడుతుంద‌నే చ‌ర్చ‌కూడా జ‌రుగుతోంది.
అస‌లు కంగ్రేస్ పార్టీలో రేవంత్ చేరే అంశాన్నే కొంత మంది నేత‌లు మొద‌ట్టో వ్య‌తిరేకించిన‌ట్టుగా ఆ మ‌ద్య ప్ర‌చారం కూడా జ‌రిగింది. కాంగ్రేస్ పార్టీలో చేరేముందే రేవంత్ రెడ్డి ముఖ్య నేత‌లను వ్య‌క్తిగ‌తంగా సంప్ర‌దించి తాను ఎందుకు కాంగ్రేస్ లో చేరుతున్నాడో వివ‌రించిన‌ట్టుగా కూడా తెలుస్తోంది.
అంత‌ర్గ‌త విభేదాలు త‌లెత్తకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. పార్టీలో చేరిన త‌ర్వాత త‌ల‌పెట్టిన మొద‌టి బ‌స్సు యాత్ర‌లో పాల్గొన్న రేవంత్ రెడ్డి కి తెలంగాణా వ్యాప్తంగా ప్ర‌జ‌లనుండి పెద్ద యెత్తున స్పంద‌న ల‌భించింది. రేవంత్ రెడ్డి ప్ర‌సంగిస్తున్న‌ప్పుడు ప్ర‌జ‌లు కేరింత‌లు కొట్టారు. రేవంత్ రెడ్డి ప్ర‌సంగం ముగిసిన వెంట‌నే ప్ర‌జలు వెళ్లిపోవ‌డం కూడా జ‌రిగేది.
వేదిక‌నుంచి ప్ర‌జ‌లు వెళ్లి పోవ‌ద్దని ఎన్ని విజ్ఞ‌ప్తులు చేసినా వినిపించుకునే వారు కాదు. దీంతో రేవంత్ రెడ్డి ఉప‌న్యాసాల‌ను స‌మావేశాల చివ‌రలో ఇవ్వాల‌ని కాంగ్రేస్ పార్టీ ఆదేశాలు కూడా జారీ చేసింది. రేవంత్ రెడ్డి పేరు చెబితే ప్ర‌జల్లో మంచి స్పంద‌న వ‌స్తున్నంత వ‌ర‌కు బాగానే ఉంది గాని రేవంత్ ప్ర‌సంగం ముగిసిన వెంట‌నే ప్ర‌జ‌లు వెళ్లిపోవ‌డాన్ని మాత్రం కాంగ్రేస్ నాయ‌కులు జీర్నించుకోలేపోతున్నారు.
బ‌హిరంగ‌స‌భ‌ల‌కు రేవంత్ హాజ‌రౌతున్నారంటే జ‌నాలు పెద్ద‌యెత్తున పాల్గొన‌డం, అనివార్య కార‌ణాల‌వ‌ల్ల రేవంత్ రెడ్డి పాల్లొన‌డం లేదంటే కార్య‌కర్త‌లు డీలా ప‌డిపోవ‌డం స్ప‌ష్టంగా క‌నిపించింది. స్థానిక నేత‌ల‌ను కాద‌ని రేవంత్ రెడ్డికి ప్ర‌జ‌లు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్న అంశం బ‌స్సుయాత్ర‌ల ద్వారా రుజువైంది. తెలంగాణ కాంగ్రేస్ లో రేవంత్ రెడ్డి ట్రంప్ కార్డ్ గా మారే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని రాష్ట్ర నాయ‌క‌త్వం గ్ర‌హించింది.

Recommended