• 6 years ago
The united opposition would be put to test as counting would be held for the various by-elections that were held on May 28. All eyes would be on Uttar Pradesh in particular after the BJP lost Gorakhpur and Phulpur recently to a joint opposition comprising the BSP and SP.

మొన్నటి గోరఖ్ పూర్, ఫల్పూర్ లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీ పతనం ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతుందనడానికి సంకేతాలా?.. లేక బీజేపీ ఓటమి ఆ రెండు స్థానాలకే పరిమితమా?.. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే నేటి 'కైరానా' లోక్ సభ ఉపఎన్నికల ఫలితాలను పరిశీలించాల్సి ఉంటుంది. గోరఖ్ పూర్, ఫల్పూర్ నియోజకవర్గాల్లో లాగే ఇక్కడ కూడా విపక్షాలన్ని బీజేపీకి ఏకమయ్యాయి. కైరానాలో బీజేపీ ప్రత్యర్థి అయిన రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థికి విపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాల ఐక్యత బీజేపీని మట్టికరిపిస్తుందా.. లేక కమలదళం తన సత్తా చాటుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
2014లో బీజేపీ కైరానా లోక్ సభ స్థానాన్ని గెలుచుకోగా.. ఎంపీ కుకుమ్ సింగ్ మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఆయన కుమార్తె మృగాంక సింగ్ బీజేపీ తరుపున ఉపఎన్నికలో పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీపై పోటీ చేస్తున్న కైరానా ఆర్.ఎల్.డి అభ్యర్థి తబసుమ్ హసన్ కి ఎస్పీ, బీఎస్పీలు మద్దతు పలికాయి. విపక్షాల ఐక్యతతో సామాజిక వర్గాల సమీకరణాలు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉండటంతో బీజేపీని దెబ్బకొట్టే అవకాశాలు లేకపోలేదు.
కైరానా నియోజకవర్గంలో ముస్లిం సామాజికవర్గ ఓట్లే కీలకం. నియోజకవర్గంలోని మొత్తం 16లక్షల ఓటర్లలో దాదాపు 6లక్షల మంది ముస్లింలే ఉన్నారు. ఎస్పీ, బీఎస్పీలు ఆర్.ఎల్.డికి మద్దతునివ్వడంతో ఆ సామాజికవర్గంతో పాటు బీసీలు, దళితుల ఓట్లన్ని ఆర్.ఎల్.డికే పడుతాయన్న చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీ మాత్రం మిగతా సామాజికవర్గాలను సమీకరించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా గుజ్జర్, జాట్, సైని, కశ్యప్, దళితుల ఓట్లను టార్గెట్ చేసింది. మొత్తంగా హిందూ ఓటు బ్యాంకు మొత్తం తన ఖాతాలోనే పడుతుందన్న ధీమాతో ఉన్నది.
#bypollresults
#byelectionresults
#Loksabha
#assemblybypolls

Category

🗞
News

Recommended