Afghanistan v/s India 2018 : Modi Congratulates Team Afganisthan

  • 6 years ago
Modi Congratulated afganisthan team.History will be created when India and Afghanistan will engage in a Test match at M Chinnaswamy Stadium here on Thursday (June 14). Afghanistan are set to make their Test after Ireland entered the elite club last month. With this one-off Test match, Afghanistan will become a Test playing nation, who have been creating quite a sensation in the limited-overs format. Afghanistan team under Asghar Stanikzai's captaincy will lock horns with the world's number one ranked Test side.

భారత్, ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య బెంగళూరు వేదికగా చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి ఆప్ఘనిస్థాన్ అరంగేట్ర మ్యాచ్ కావడంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ జట్టుకు ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.
"ఆప్ఘనిస్థాన్ జట్టు తొలి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌ని ఆడుతున్న సందర్భంగా ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు. చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ కోసం ఇండియాను ఎంపిక చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇరు జట్లకు అభినందనలు. క్రీడలు ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలను నెలకొనేందుకు దోహదపడుతున్నాయి" అని ట్వీట్ చేశారు.
మరోవైపు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) అఫ్ఘనిస్థాన్‌ జట్టుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్‌లో ఓ లేఖను అభిమానులతో పంచుకుంది. "ఆప్ఘనిస్థాన్ తమ అరంగ్రేట టెస్టు మ్యాచ్‌ భారత్‌తో ఆడటం గొప్ప గర్వకారణం. యువకులతో కూడిన వారి జట్టు అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌లో చోటుదక్కించుకోవడం అభినందనీయం. గతేడాది అప్ఘన్ జట్టుకు‌ టెస్టు హోదా దక్కింది. వారి ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగింది" అని చెప్పుకొచ్చారు. లేఖలో సారాంశాన్ని మ్యాచ్‌ ముందు కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ చదివారు.

Recommended