Sammohanam Movie Premier Show Talk

  • 6 years ago
Sammohanam Movie premier show talk. Once again Indraganti Mohan Krishna shows his magic.

సుధీర్ బాబు, అదితి రావు జంటగా నటించిన సమ్మోహనం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టీజర్, ట్రైలర్స్ లో ఈ చిత్రంలోని ప్రెష్ కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేసిన చిత్రం కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సుధీర్ బాబు కెరీర్ కు సమ్మోహనం చిత్రం చాలా కీలకం. విడుదలకు ముందే సమ్మోహనం చిత్రం పాజిటివ్ బజ్ సొంతం చేసుకుంది. సీనియర్ నటుడు నరేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. యుఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోలు పడ్డాయి. సుధీర్ బాబు, అదితిల సమ్మోహనం ఏమేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
ప్రచార చిత్రాల్లోనే హీరోయిన్ అదితి రావు హైదరి పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంలో అదితి అప్ కమింగ్ హీరోయిన్ పాత్రలో నటించింది. అదితి పాత్ర ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.
చిత్ర పరిశ్రమపై కొందరిలో ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగించేలా ఇంద్రగంటి మోహన్ కృష్ణ కొన్ని సెటైరికల్ సన్నివేశాల్ని చూపించారు.
అదితి రావుకు తెలుగు డైలాగ్స్ నేర్పించే గైడ్ పాత్రలో సుధీర్ బాబు కనిపించాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. చిత్రంలో పాటలు, లొకేషన్స్, అందమైన విజువల్స్ మరో ప్లస్ పాయింట్.
ఫస్ట్ హాఫ్ ని దర్శకుడు ఎక్కువగా సాగదీసినట్లు తెలుస్తోంది. అయినా కానీ మంచి సన్నివేశాలు పడ్డాయి. స్లోగా సాగుతున్నా ఆడియన్స్ ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు.

Recommended