Bigg Boss Season 2 Telugu : Luxury Budget Task Ended

  • 6 years ago
Bigg Boss 2 Telugu Day 5 highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. And guess what, Day Zero has already seen a couple of nominations.
#BiggBoss2Telugu

బిగ్ బాస్ 2 గురువారం (జూన్ 14)న ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఎలాంటి ఆసక్తికర సంఘటనలు, ఫన్ ఎలిమెంట్స్ లేక పోగా ఇంటి సభ్యులు గొడవ పడ్డ తీరు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. ఒక్కటంటే ఒక్క ఆసక్తికర మూమెంట్ కూడా ఈ నాటి షోలో లేక పోవడం గమనార్హం. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాను రాను ప్రేక్షకుల్లో బిగ్ బాస్ 2 మీద ఆసక్తి మరింత తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవరాల్‌గా గురువారం నాటి బిగ్ బాస్ షో ప్రేక్షకుల్లో ఈ రియాల్టీషోపై ఆసక్తి మరింత సన్నగిల్లేలా చేసింది.
నూతన్ నాయుడు ఓవరాక్షన్ చేస్తున్నాడని, తాము అడగకపోయినా ఉచిత సలహాలు, ఫిలాసఫీలు చెబుతూ తమను ఇబ్బంది పెడుతున్నాడని, అనవసరంగా లెక్చర్లు ఇవ్వడం మానుకోవాలని తనీష్, సామ్రాట, తేజస్వి తదితరులు మండి పడ్డారు.
ఒకే టీంలో ఉన్న తేజస్వి, సంజన మధ్య అస్సలు పడటం లేదు. తాజాగా వంట చేసే విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. తేజస్వి వంటచేసి తానే అన్ని మార్కులు కొట్టేస్తుందని, తనకూ అవకాశం ఇవ్వాలని సంజన వాదించిన తీరు, దానికి తేజస్వి రియాక్ట్ అయిన తీరు ప్రేక్షకులకు మరింత చికాకు తెప్పించింది.
బిగ్ బాస్ అప్పగించిన మొదటి టాస్క్ ‘చెప్పండి ప్రభు' సంజన టీం, కిరీటి టీం విజయవంతంగా పూర్తి చేశారు. 177 పాయింట్లు కిరిటీ టీం సాధించగా, సంజన టీం 170 పాయింట్లు సాధించింది. ఎక్కువ పాయింట్లు సాధించిన కిరిటీ టీంను బిగ్ బాస్ విజేతగా ప్రకటించాడు.

Recommended