England Set New Record For The Highest ODI Total

  • 6 years ago
England put on a batting masterclass, shattering ODI records in the process, as they thrashed a shell-shocked Australia by 242 runs to clinch the five-match series in style. Eoin Morgan's side had posted their highest 50-over total against Australia in this format to take a 2-0 lead last time out in Cardiff, but they blew that score of 342-8 out of the water with a scintillating display at Trent Bridge.

వన్డే సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియాకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా జట్టుపై ఆద్యంతం ఇంగ్లాండ్ తన ప్రదర్శన కనబరుస్తోంది. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేలను గెలుచుకున్న ఇంగ్లాండ్, మంగళవారం జరిగిన మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
నాటింగ్‌హామ్‌ వేదికగా జరిగి మూడో వన్డేలో మోర్గాన్‌ సేన వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మంగళవారం జరిగిన డే-నైట్‌ వన్డేలో ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 481 పరుగులు చేసింది. ఫలితంగా 2016లో పాకిస్థాన్‌పై చేసిన 444 పరుగుల రికార్డును ఇంగ్లాండ్ తానే బద్దలు కొట్టింది.
ఒకానొక దశలో 500 పరుగుల మైలురాయిని చేరుకుంటుందని భావించినా చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో 481 పరుగులతోనే సరిపెట్టుకుంది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లలో అలెక్స్‌ హేల్స్‌ (92బంతుల్లో 147; 16 ఫోర్లు, 5 సిక్సర్లు), జాన్‌ బెయిర్‌స్టో (92 బంతుల్లో 139; 15 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలు నమోదు చేశారు.

Recommended