2019 ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు???

  • 6 years ago
The day Congress conceived the partition of AP into Andra Pradesh and Telengana, it was doomed to oblivion. It became directionless. Congress did not do its homework properly.
#ysjagan
#kirankumarreddy
#pawankalyan
#janasena
#andhrapradesh
#bjp
#congress

విభజన నేపథ్యంలో ఏపీలో పూర్తిగా ప్రాతినిథ్యం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలో మళ్లీ పుంజుకుంటామనే ఆశలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయం ప్రకారం.. విభజన హామీల్లో టీడీపీ, బీజేపీలు విఫలం కావడం, ప్రతిపక్షంగా వైసీపీ విఫలం కావడం... తమకు కలిసి వస్తాయని భావిస్తోంది. ముఖ్యంగా తాము అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పడం ఉపకరిస్తుందని అనుకుంటోంది.
దీనికి తోడు పాత కాపులను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మొదటి రాయి ఫలప్రదం అయ్యేలా కనిపిస్తోంది. అదే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేతలు పళ్లంరాజు, ఆ తర్వాత బుధవారం మరో సీనియర్ నేత టీఎస్సార్ మాజీ సీఎంను కలిశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు దాదాపు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.

Recommended