డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్, యూఎస్ఏ సెక్స్ రాకెట్ పై సురేష్ బాబు స్పందన

  • 6 years ago
ఇండియాలో బాలీవుడ్ తర్వాత అతిపెద్ద సినీ ఇండస్ట్రీగా టాలీవుడ్ పేరు తెచ్చుకుంది. అధిక సంఖ్యలో సినిమాలతో పాటు బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. ఇదంతా నాణేనికి ఒక వైపు. మరో వైపు ఇండస్ట్రీలో చిన్న సినిమాలను తొక్కేస్తున్నారనే గొడవలు, కాస్టింగ్ కౌచ్ పెద్ద ఇష్యూ కావడం, టాలీవుడ్ డ్రగ్స్ కేసు కలకలం, చికాగో సెక్స్ రాకెట్లో తెలుగు వారికి లింక్స్... ఇలా అనేక సమస్యలు ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు టీవీ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వెల్లడించారు.
భారీ బడ్జెట్ సినిమాల కంటే చిన్న సినిమాలే ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి, కానీ ఇప్పటికీ చిన్న సినిమాలను ఆ నలుగురు థియేటర్లు దొరకకుండా తొక్కేస్తున్నారనే ఒక వాదన ఎప్పటి నుండో ఉంది. దీనిపై సురేష్ బాబు స్పందిస్తూ ఇలా అనడం ఫూలిష్ టాక్. మొన్న పది చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిని ఎవరు తొక్కేశారు? అన్నింటికీ కొన్ని థియేటర్లు దొరికాయి. పెద్ద సినిమాలు ఆడటం లేదనటం కూడా ఫూలిష్. రంగస్థలం చాలా బాగా ఆడింది. రామ్ చరణ్ వెరీ కమర్షియల్ యాక్టర్. ఒక న్యూ ఏజ్ కమర్షియల్ సినిమాను వారు క్రియేట్ చేశారు.... అని సురేష్ బాబు తెలిపారు.
తొక్కేస్తున్నారని కంప్లయింట్ చేసే వారు కరెక్ట్ సినిమా తీస్తున్నారా? లేదా? అనేది చూడాలి. తొక్కేస్తున్నారు అనే వారు... ఈ రోజు ఎన్ని థియేటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్నాయో చూడాలి. చాలా థియేటర్లు షోలు వేయలేక మూసుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పటికీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 1700 నుండి 1800 థియేటర్లు ఉన్నాయి. మేము కొంచెం అయినా జనం వచ్చే సినిమాలు వేసుకోవాలని చూస్తాం. కానీ అలాంటి సినిమాలు దొరకడం లేదు. అన్ని మంచి సినిమాలు రావడం లేదు.... అని సురేష్ బాబు అన్నారు.

Recommended