పవన్ చిన్న నాటి ఫోటోలు వైరల్

  • 6 years ago
Andhra Pradesh TDP chief Kala Venkata rao open letter to Jana Sena chief Pawan Kalyanl. TDP MLA Bandaru Satyanarayana Murthy takes on Janasena chief for his allegations
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు గురువారం బహిరంగ లేఖ రాశారు. సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్, కాపు రిజర్వేషన్ బిల్లుపై జనసేనా కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇచ్చిన రూ.150 కోట్లు కేంద్రం వెనక్కి తీసుకుంటే అడగలేదేం అన్నారు విశాఖపట్నం గిరిజన వర్సిటీపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
తాను, తన కొడుకు పెద్ద ఎత్తున భూమిని ఆక్రమించామని పవన్ చెప్పడం సరికాదని, ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. పవన్‌కు దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. నిజంగా, వందలాది ఎకరాల భూములను తాను ఆక్రమిస్తే ఈ పాటికి మీడియా తనను బయటపెట్టేదన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌తో జనసేనాని మాట్లాడుతున్నారని ఆరోపించారు.
వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తాను కూడా చాలా విషయాలు మాట్లాడగలనని, ఈ విషయం పవన్ గుర్తుంచుకోవాలని బండారు హెచ్చరించారు. పవన్ కొత్తగా రాజకీయాలు నేర్చుకున్నారని, తాను చిన్నప్పటి నుంచి రాజకీయాలు నేర్చుకున్నానని చెప్పారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశానని, ఇప్పటి వరకు తనపై ఎలాంటి ఆరోపణలు లేవని చెప్పారు. తనను ఇప్పటి వరకు ఎవరూ వేలెత్తి చూపలేదన్నారు. నేను, నా కొడుకు కలిసి వందకోట్ల ఆస్తి సంపాదించామని పవన్ ఆరోపించారని మండిపడ్డారు.

Recommended