M.S Dhoni Reaches To A Great Mile Stone In cricket

  • 6 years ago
ఆటకు వయస్సు కేవలం సంఖ్య మాత్రమే అనడానికి మహేంద్ర సింగ్‌ ధోని ముందుంటాడు. ఇదే క్రమంలో ధోనీ తన కెరీర్‌లో మరో మైలు రాయి అందుకోనున్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీ20ల్లో అత్యధిక స్టంప్స్‌ సాధించిన వికెట్‌ కీపర్‌గా ధోని గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టీ20.. అన్ని ఫార్మాట్లతో కలిపి ధోనికి 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం విశేషం.
దీంతో ఈ అరుదైన ఘనత సాధించిన మూడో భారత క్రికెటర్‌గా ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ చరిత్ర సృష్టించనున్నాడు. ధోని కంటే ముందు భారత్‌ నుంచి దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్(664)‌, రాహుల్‌ ద్రవిడ్‌ (509)లు మాత్రమే ఈ ఘనతను సొంతం చేసుకున్నారు.
ఓవరాల్‌గా ఈ జాబితాలో ధోని 9వ స్థానం దక్కించుకోనున్నాడు. ఈ జాబితాలో సచిన్‌ అగ్రస్థానంలో ఉండగా.. మహేళ జయవర్దనే, కుమార సంగక్కర, సనత్‌ జయసూర్య, రికీ పాంటింగ్‌, షాషిద్‌ అఫ్రిదీ, జక్వాస్‌ కల్లీస్‌, ద్రవిడ్‌లు ధోని కన్నా ముందున్నారు. ఇక 2014లో టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని వన్డే, టీ20ల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

While the contingent had arrived from Delhi on Saturday they began their first training session on-tour on Monday (June 25) at the Merchants Taylor School cricket ground in London. Ireland have never beaten India in any format (3 ODIs and 1 T20I), but the effervescent Irish side would be hoping to pose a challenge to this Indian team for they have nothing to lose.

Recommended