FIFA 2018: France Wins On Uruguay

  • 6 years ago
Didier Deschamps had no desire to answer a question on the eve of this game about whether France could end up as champions, a man who knows what it takes to win a World Cup stubbornly refusing to look too far into the distance. Deschamps, however, will only be able to avoid that subject for so long after France eased past Uruguay, courtesy of Raphaël Varane’s splendid header and an awful blunder by Fernando Muslera, to reach the World Cup semi-finals for the first time since 2006.

రష్యా వేదికగా జరుగుతోన్న ఫిఫా 2018 ప్రపంచ కప్‌ టోర్నీలో ఫ్రాన్స్‌ జట్టు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో ఉరుగ్వేపై 0-2 తేడాతో ఫ్రాన్స్‌ విజయం సాధించింది. లీగ్‌ దశలో ప్రత్యర్థులకు ఒక్క గోల్‌ కూడా ఇవ్వని ఉరుగ్వే కీలకమైన మ్యాచ్‌లో చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది.ఈ సారి సాకర్ ప్రపంచకప్ హాట్ ఫేవరెట్స్‌లో ఒకటైన ఫ్రాన్స్ ట్రోఫీ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. సెమిస్‌లో తొలి బెర్త్ ను ఫ్రెంచి జట్టు ఖరారు చేసుకుంది. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఉరుగ్వేను క్వార్టర్స్‌లో ఓడించి సెమిస్‌లో అడుగు పెట్టింది ఫ్రాన్స్. తద్వారా ఆరోసారి ప్రపంచకప్ సెమిస్‌లో అడుగుపెట్టింది ఈ జట్టు. 2006 తర్వాత ఫ్రాన్స్ సెమిస్‌లోకి ప్రవేశించడం ఇదే తొలి సారి కావడం గమనార్హం.