కవిత పై మండి పడ్డ కోమటి రెడ్డి

  • 6 years ago
దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా తిరిగి కవితను గెలిపించుకుంటే తను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ఒక సీఎం కూతురిగా ఎంపీ కవిత జిల్లాకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు విషయంలో కవితకు చిత్తశుద్ధి లేదని చెప్పిన కోమటిరెడ్డి...
కేటీఆర్ స్థాయికి మించి మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఎంసెట్ పేపర్ లీకేజీ కేసును ప్రభుత్వం కావాలనే పక్కకు పెట్టిందని ఇందుకు కారణం శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో కేసీఆర్ కుటుంబానికి 40శాతం వాటాలు ఉన్నందునే అని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.
ఇక తనపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని.. కావాలనే తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిందని ఉద్ఘాటించారు. తనకు గన్‌మె‌న్‌ను కూడా తొలగించారని చెప్పారు. ఇక ఇదే విషయమై ఈనెల 13న కోర్టు తుది తీర్పు ఇవ్వనుందని కోమటిరెడ్డి వివరించారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు అన్ని వర్గాలు ఏకం కావాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నకిరేకల్‌ నియోజకవర్గంలో తిరుగుతుంటే అక్కడ కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు.

Recommended