చెన్నైలో నటి ప్రియాంక ఆత్మహత్య

  • 6 years ago
సినిమా లోకం అనేది రంగుల ప్రపంచం. నిజజీవితానికి భిన్నంగా ఉన్నట్లు సినిమా ప్రపంచం అనిపిస్తుంది. కానీ సినిమా నటులు కూడా మనుషులే. సాధారణ కుటుంబ కష్టాలు వీరికి కూడా ఉంటాయి. తాజగా చైన్నైలో విషాదం చోటు చేసుకుంది. తమిళ బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు ఉదయం ఈ ఘటన జరిగింది. బుల్లితెర నటి ప్రియాంక పలు టివి సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయింది. కొన్ని చిత్రాలలో కూడా నటించింది. ఆమె ఊహించనివిధంగా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
నటి ప్రియాంక చెన్నైలోని వలసరవాక్కంలో నివాసం ఉంటోంది. నేటి ఉదయం ఆమె తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియాంక ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నారా లేరా అనే విషయాలని పోలీసులు దర్యాప్ట్ చేస్తున్నారు.
ప్రియాంక ఆత్మహత్యకు సరైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనం ప్రకారం కుటుంబ సమస్యలే ఆమె ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. వివాహం అనంతరం కూడా ప్రియాంక టివి సీరియల్స్ లో నటిస్తోంది.

Recommended