ఇది ఆధిక్యతకు, నైతికతకు మధ్య జరుగుతున్న యుద్ధం : గల్లా జయదేవ్

  • 6 years ago
Telugu Desam Party (TDP) MP Jayadev Galla moved Motion of No Confidence against the Modi government in Parliament on Thursday. Guntur MP Jayadev Galla said against the injustice meted out to the people of Andhra Pradesh.

అవిశ్వాసం తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ప్రధానిని మోసగాడు అని అర్థం వచ్చేలా మాట్లాడారు. దీనిపై బీజేపీ ఎంపీలు తీవ్ర నిరసన తెలిపారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ టీడీపీని దులిపేశారు.
ప్రధాని మోడీని మోసగాడు అని అర్థం వచ్చేలా గల్లా మాట్లాడారు. దీనిపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే స్పందించారు. టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మోసగాడు అన్న పదంపై బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. పరిశీలించి దానిని తొలగిస్తామని స్పీకర్ తెలిపారు.
పార్లమెంటులో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం అనేది జాతీయ సమస్య అన్నారు. చేసిన వాగ్ధానం నెరవేర్చకపోవడం గౌరం కాదన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం జాతీయ సమస్య అన్నారు. ఏపీ విషయంలో కాంగ్రెస్ పార్టీది అపరాధం అయితే, బీజేపీది మహాపరాధం అన్నారు.5 కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన మాటను మోడీ నిలబెట్టుకోలేదని అన్నారు. ఇప్పుడు ఏపీ ఇష్యూ మొత్తం దేశానికే ఇష్యూగా మారిందన్నారు. ఇది బీజేపీ, టీడీపీ మధ్య యుద్ధం కాదని, ఇది ఆధిక్యతకు, నైతికతకు మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. మోడీ పాలనకు, ఏపీ రాష్ట్రానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు.