రోజుకో వివాదంలో చిక్కుకుంటున్న మెగాస్టార్ సినిమా

  • 6 years ago
Uyyalavada Narasimha Reddy, who has fight with British Army in the backdrop of Indian freedom fight...now his life is going to be a movie with Megastar Chiranjeevi as Hero. But this movie surrounds another controversy.
#andhrapradesh
#hyderabad
#fight
#megastarchiranjeevi


బ్రిటీష్ సైన్యాన్ని గడగడలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం సైరా పేరుతో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని మరో వివాదం చుట్టుముట్టింది. తమ వంశానికి పేరు తెచ్చిపెట్టిన పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని తెరకెక్కిస్తూ తమను కనీసం గుర్తించకపోవడం...సంప్రదించకపోవడం అన్యాయమని ఉయ్యాలవాడ వంశీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మాట్లాడేందుకు ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చినా...ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కూడా తమను ఏమాత్రం పట్టించుకోకపోవడం సరికాదని వారు వాపోతున్నారు.

Recommended