సుప్రీంకోర్టు వివాహేతర సంబంధం నేరం కాదని చెబుతూ గురువారం కీలక తీర్పునిచ్చింది. ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. అయితే ఈ కేసులో ఒక ఆసక్తికరమైన సంగతి ఉంది. ఈ ధర్మాసనంలో జడ్జిగా జస్టిస్ చంద్రచూడ్ ఉన్నారు. ఇంకా ఇంట్రస్టింగ్ ఏమిటంటే... 33 మూడేళ్ల క్రితం ఇదే సెక్షన్ 497కు సంబంధించి నాడు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వైవీ చంద్రచూడ్ రూలింగ్ ఇచ్చారు. మళ్లీ ఇదే కేసుపై జస్టిస్ డీవై చంద్రచూడ్ తన తండ్రి రూలింగ్‌ను కాకుండా తన వేరు అభిప్రాయన్ని చెప్పారు. 33 ఏళ్ల క్రితం సీనియర్ చంద్రచూడ్ తీర్పు చెబుతూ అన్ని వివాహేతర సంబంధాలు కాకపోయినప్పటికీ కొన్ని మాత్రం నేరాలుగా పరిగణించాల్సిందేనని చెప్పారు. కానీ గురువారం జూనియర్ చంద్రచూడ్ మాత్రం తండ్రి తీర్పుతో విబేధిస్తూ అసలు అక్రమసంబంధాలు నేరపూరితం కాదని పేర్కొన్నారు
#ipcsection497
#aladmjabalpurcase
#supremecourt
#justicechandrachud
#YVChandrachud
#ipcsection497
#aladmjabalpurcase
#supremecourt
#justicechandrachud
#YVChandrachud
Category
🗞
News