మైనింగ్ కింగ్ ఇంటిలో సోదాలు..!

  • 6 years ago
A day after mining baron Gali Janardhana Reddy was accused of being involved in a ponzi scam, the Central Crime Branch sleuths investigating the case have raided his Residence in Ballari.
#GaliJanardhanReddy
#Moneylaunderingcase
#bjp
#CCB
#BengaluruCCBpolice

బళ్లారిలోని సిరుగుప్ప రోడ్డులో ఉన్న కర్ణాటక మాజీమంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఇంటిలో బెంగళూరు సీసీబీ పోలీసులు గురువారం దాడులు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెందిన 15 చోట్ల బెంగళూరు సీసీబీ పోలీసులు సోదాలు చేస్తున్నారు. బళ్లారిలోని అవంబావి ప్రాంతంలో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి బెంగళూరు సీసీబీ పోలీసు అధికారి మంజునాథ్ చౌధరి నేతృత్వంలోని అధికారులు వెళ్లారు. అనంతరం గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలోని బంగారం, విలువైన ప్రతాలను అధికారులు పరిశీలిస్తున్నారు.